ఈద్దమ్మ, ఎల్లమ్మ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

చిట్యాల, ఆంధ్రప్రభ ; వట్టిమర్తి గ్రామ ప్రజలపై శ్రీ ఈద్దమ్మ తల్లి,శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవతల ఆశీస్సులు ఉండాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే తెలిపారు.
గురువారం నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధి చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ ఈద్దమ్మతల్లి, శ్రీ రేణుకఎల్లమ్మ దేవతల ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తిని శాలువ తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆసరా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ వార్డు సభ్యులు మేడి హరికృష్ణ, మేడి రాజు, తదితరులు పాల్గొన్నారు.
