చాందిని పుస్తకానికి ఉత్తమ పురస్కారం

చాందిని పుస్తకానికి ఉత్తమ పురస్కారం
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : పట్టణానికి చెందిన పఠాన్ చాందిని రచించిన పుస్తకానికి సముచిత గౌరవం దక్కింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8న గుజరాత్ రాష్ట్రంలోని అహమ్మదాబాద్‌లో ప్రముఖ మెంటల్ హెల్త్ కోచ్ డాక్టర్ యోగేంద్రసింగ్ రాథోర్(డాక్టర్ వైఎస్సార్) ఆధ్వర్యంలో మహిళల మానసిక స్థితిగతులపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్‌లో చాందిని మహిళల వ్యక్తిత్వ వికాసంపై ఆంగ్లంలో రచించిన హై పెర్‌ఫార్మెన్స్ మోడల్ అనే పుస్తకానికి అవార్డు లభించింది.
పుస్తకంలో పురుషులతో సమానమైన ఉద్యోగాలు చేస్తూ సమాజంలో ఎంతో గుర్తింపు పొందిన మహిళలు సైతం కొన్ని సందర్బాలలో తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్న తీరును వివరించారు. అటువంటి సందర్బాలలో క్షణిక ఆవేశంలో జీవితాలు నాశనం చేసుకోవడం వలన వారి పిల్లలు అనాధలు అవుతున్న తీరు హృదయాలకు హత్తుకొనేలా రచించారని డాక్టర్ వైఎస్సార్ కొనియాడారు. ఈ సందర్బంగా చాందిని మాట్లాడుతూ తన పుస్తకం చదివి మహిళలు డిప్రెషన్ పోగొట్టుకొని విజయం సాధిస్తే తన జన్మ ధన్యమైనట్లు భావిస్తానని తెలిపారు.
హైదరాబాద్‌లో చార్టర్డ్ ఎకౌంటెంట్‌గా పనిచేస్తున్న చాందిని చిలకలూరిపేట పట్టణానికి చెందిన ఫిల్మ్ ఎగ్జిబిటర్ మొహమ్మద్ కోడలు కావడంతో పలువురు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు, ఫిల్మ్ ఎగ్జిబిటర్లు అభినందనలు తెలిపారు.
