ఓటర్ జాబితా సవరణపై జేసీ కీలక ఆదేశాలు
బాపట్ల, ఆంధ్రప్రభ: బాపట్ల జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం పురోగతిని జాయింట్ కలెక్టర్ కుమారి భావన వశిష్ఠ శుక్రవారం పరిశీలించారు. బాపట్ల పురపాలక సంఘ పరిధిలోని రైలుపేట సచివాలయాన్ని సందర్శించిన ఆమె, కమిషనర్ ఎం. హాసిని, తహశీల్దార్ షేక్ సలీమాతో కలిసి గణన పత్రాల స్వీకరణ, నమోదు, ధృవీకరణ ప్రక్రియలను సమీక్షించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తిచేసేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ స్పష్టం చేశారు.
