దుర్గిలో రోడ్డు ప్రమాదం..

దుర్గిలో రోడ్డు ప్రమాదం..

  • ముగ్గురికి తీవ్ర గాయాలు
  • నర్సరావుపేట ఆసుపత్రికి తరలింపు

దుర్గి, ఆంధ్రప్రభ : దుర్గి మండలం వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదం బుధవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. కారు నంబర్ AP 05 BT 1224, ద్విచక్ర వాహనం నంబర్ AP 39 BP 6239గా గుర్తించారు.

ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామానికి చెందిన కొనసాని రాఘవేంద్రరావు (25), తండ్రి వెంకయ్య, కారు డ్రైవర్‌గా పనిచేస్తూ మాచర్ల నుండి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో దుర్గి గ్రామానికి చెందిన రామావత్ మణికంఠనాయక్, బద్దు నాయక్, నర్సమ్మ, హనీ మాలు నలుగురు ఒకే ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మణికంఠనాయక్, హనీ మాలు కాళ్లు విరిగినట్లు సమాచారం. నర్సమ్మ, బద్దు నాయక్‌లకు తీవ్ర గాయాలు కావడంతో వారిని నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వారి బంధువులు తెలిపారు. ఈ ఘటనపై దుర్గి పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.