ఊట్కూర్ జీపీలో మాజీ సర్పంచ్‌ల ఫోటోలు ఏర్పాటు..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేట జిల్లా ఊట్కూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ ఎం. రేణుక భరత్ మాజీ సర్పంచ్ ల ఫోటోలు ఏర్పాటు చేయడంతో కార్యాలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామానికి వివిధ సేవలు చేసిన మాజీ సర్పంచ్ లకు కార్యాలయంలో ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని లక్ష్యంతో గ్రామపంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి మాజీ సర్పంచ్ ఫోటోలు సేకరించి ఏర్పాటు చేశారు.
మాజీ సర్పంచ్ లు దివంగత గొల్ల చిన్నయ్య, ఎల్కోటి ఎల్లారెడ్డి, ఎం. నర్సిరెడ్డి, గరిడి నింగిరెడ్డి, ఎం. బాల్ రెడ్డి, ఎల్కోటి గోవర్ధన్ రెడ్డి, ఎం.సుశీలమ్మ, ఎం. భాస్కర్, సి. సూర్య ప్రకాశ్ రెడ్డిల ఫోటోలు ఏర్పాటు చేయగా దివంగత మాజీ మంత్రి ఎల్కోటి ఎల్లారెడ్డి, కుటుంబంలో తనయుడు గోవర్ధన్ రెడ్డి సర్పంచ్ గా పనిచేశారు.
కాగా.. దివంగత మాజీ సర్పంచ్ ఎం నర్సిరెడ్డి, కుటుంబంలో సోదరులు బాల్ రెడ్డి, మరదలు సుశీలమ్మ సర్పంచ్ లుగా ప్రజలకు సేవ చేయగా ఎం. భాస్కర్ సర్పంచ్ గా పని చేయగా అతని సోదరుడు బాబు కోడలు ఏం.రేణుక భరత్ ప్రస్తుతం సర్పంచ్, గా కొనసాగుతున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో మాజీల ఫోటోలు ఏర్పాటు చేయడం పట్ల వివిధ పార్టీల నాయకులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
