Markets | 400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదల

Markets | 400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదల

Markets | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో కొనసాగుతోన్న ఉద్రిక్తతలతో చమురు విడుదలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) కీలక నిర్ణయం తీసుకుంది.

యుద్ధం దృష్ట్యా ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఒత్తిడిని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర నిల్వల నుంచి 400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 2022 ఉక్రెయిన్ యుద్ధంలో విడుదల చేసిన 182 మిలియన్‌ బ్యారెళ్ల కంటే ఇది ఎక్కువ. 32 సభ్య దేశాలు ఇందుకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి.