ఆడపిల్లల ఆరోగ్యానికి వ్యాక్సిన్ మేలు

ఆడపిల్లల ఆరోగ్యానికి వ్యాక్సిన్ మేలు

రాప్తాడు, ఆంధ్రప్రభ : అమ్మాయిలకు క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఈ వ్యాక్సిన్ చాలా బాగా ఉపయోగపడుతుందని డాక్టర్ శివకృష్ణ తెలియజేశారు. రాప్తాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య నందు వివిధ గ్రామాల నుంచి వచ్చిన అమ్మాయిలకు హెచ్ పి వి వ్యాక్సిన్ సూది మందు వేశారు.అలాగే వ్యాక్సిన్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ విష్ణుమూర్తి తాహసీల్దార్ విజయకుమారి హాజరయ్యారు.ఈ సంధర్భంగా మాట్లాడుతూ అమ్మాయిలు ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వలన ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు.

120 మంది అమ్మాయిలకు వ్యాక్సిన్ వేశామన్నారు. ఆడపిల్లలకు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు ఈ సూది మందు బాగా పనిచేస్తుందని తెలిపారు. ఆడపిల్లలకు వ్యాక్సిన్ వేయించడానికి వచ్చిన తల్లిదండ్రులకు కూడా వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించాము. వ్యాక్సిన్ పైన ఎలాంటి అపోహాలు అనుమానాలు పెట్టుకోవద్దన్నాము.14 నుండి 15 సం.లు అమ్మాయిలు తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి.హెచ్ పీ వి వ్యాక్సిన్ ను ఇంకా 2 రోజులు పాటు వేస్తామని తెలియజేశారు.

ఈ అవకాశాన్ని మండలంలోని అమ్మాయిలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పంపు కొండప్ప సర్పంచ్ సాకే తిరుపాల్ సి హెచ్ ఓ శివప్రసాద్ సూపర్వైజర్ నరసింహులు ఆశ నోడల్ ఆఫీసర్ నారాయణ స్వామి ఎల్.టీ శ్రీధర్ బాబు ఫార్మసిస్ట్ మూర్తి స్టాఫ్ నర్సులు లక్ష్మీ జయమ్మ మేల్ అసిస్టెంట్ గిరిధర్ ఏఎన్ఎంలు నాగలక్ష్మి నిరోషా ఝాన్సీ శారద ఎంఎల్ హెచ్ పిలు అర్చన మీనా సత్యమయ్య ఆశలు విజయలక్ష్మి ఇందిరమ్మ ఓబులమ్మ నాగవేణి గాయత్రి నాగేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply