2027 జనగణనపై అధికారులకు శిక్షణ

2027 జనగణనపై అధికారులకు శిక్షణ

  • సమగ్రంగా వివరాలు నమోదు చేయాలి
  • భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి: రాబోయే 2027 జనగణనను సమర్థంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, విద్యాశాఖల అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనగణనను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ చేపట్టి గృహాల పరిస్థితులు, సౌకర్యాలు, కుటుంబాల వివరాలు సేకరిస్తారని తెలిపారు. రెండో దశలో జనాభా గణన నిర్వహించి ప్రజల సామాజిక, ఆర్థిక వివరాలను నమోదు చేస్తారని చెప్పారు. జిల్లా స్థాయిలో సర్వే పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నందున అధికారులు ఖచ్చితత్వంతో వివరాలు నమోదు చేయాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సీపీఓ జవహర్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.