TG | వరంగల్ రైల్వే స్టేషన్ ను సందర్శించిన సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం

కరీమాబాద్, మే 17 (ఆంధ్రప్రభ) : వరంగల్ రైల్వే స్టేషన్ ను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సందర్శించారు. శనివారం వరంగల్ చేరుకున్న ఆయన అధికారులతో సమావేశమై అభివృద్ధి పనులను జీఎం పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈనెల 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా రైల్వే స్టేషన్ ప్రారంభించనున్న నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో మాట్లాడి అందుకు తగ్గ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వరంగల్ రైల్వే స్టేషన్ ను నూతన హంగులతో పునరుద్ధరించారు.

ఎయిర్ పోర్టును తలపించే విధంగా వసతులు కల్పించారు. లిఫ్టులు ఎస్కలేటర్లు, ర్యాంపులు విశాలమైన ఫోటో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కాకతీయుల కళా వైభవాన్ని ప్రతిబించే విధంగా నిర్మాణ శైలిని పూర్తి చేశారు. అత్యంత ఆధునికమైన వసతులతో ప్రయాణికులకు సేవలు అందించేందుకు వరంగల్ రైల్వే స్టేషన్ ముస్తాబైంది. అమృత్ భారత్ స్టేషన్స్ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం 25కోట్ల నిధులతో భవనాన్ని ఆధునీకరించారు. ఈనెల 22న భారత ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని పర్చువల్ గా ప్రారంభిస్తారని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రైల్వే శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Leave a Reply