అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత

అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత

ట్రాక్టర్ స్వాధీనం ,ఒకరిపై కేసు నమోదు
చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్

చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలుతీసుకుంటామని చిట్యాల ఎస్సై, పోచంపల్లి సతీష్ , హెచ్చరించారు. బుధవారం మండలంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక ట్రాక్టరును పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.


​మండలంలోని కాల్వపల్లి మానేరు నుండి భూపాలపల్లి వైపు వెళ్తున్న ఒక ఇసుక ట్రాక్టరును పోలీసులు ఆపి తనిఖీ చేశారు. సదరు ట్రాక్టరుకు ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో, అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించి ట్రాక్టరును స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ అమిత్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే లేదని స్పష్టం చేశారు.

అక్రమ రవాణాకు పాల్పడే వాహనాలను సీజ్ చేయడంతో పాటు, యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు ఎవరైనా అక్రమ ఇసుక రవాణ చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్సై సతీష్ కోరారు.

Leave a Reply