Naga Chaitanya | వృషకర్మ బడ్జెట్ ఎంత…?

Naga Chaitanya | వృషకర్మ బడ్జెట్ ఎంత…?

వృషకర్మ సినిమాపై పెరిగిన అంచనాలు
గ్లింప్స్‌తో భారీ క్రేజ్
100 కోట్ల బడ్జెట్‌తో వృషకర్మ
చైతూ కెరీర్‌లోనే భారీ థియేట్రికల్ డీల్
ఇంకా జరగాల్సిన ఓటీటీ, శాటిలైట్ బిజినెస్

Naga Chaitanya | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) తండేల్ సినిమాతో కమర్షియల్ సక్సెస్ తో పాటు బెస్ట్ యాక్టర్ గా అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తండేల్ ఇచ్చిన జోష్ తో.. నాగచైతన్య వృషకర్మ అనే థ్రిల్లర్ మూవీ చేశాడు. ఈ భారీ చిత్రాన్ని విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు తెరకెక్కించారు. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే.. సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటించలేదు. అలాగే బడ్జెట్ బాగా పెరిగిందని టాక్ వచ్చింది. ఇప్పుడు బిజినెస్ బాగా జరిగిందని.. జాక్ పాట్ కొట్టాడు అని టాక్. ఇంతకీ.. బడ్జెట్ ఎంత..? జరిగిన బిజినెస్ ఎంత..?

Naga Chaitanya

Naga Chaitanya | అంచనాలు పెంచేసిన గ్లింప్స్..

తండేల్ సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఆ సినిమాతో నాగచైతన్య ఒక మెట్టు ఎక్కాడు. దీంతో వృషకర్మ సినిమాకి 100 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఇంకా చెప్పాలంటే.. ఈ బడ్జెట్ కాస్త ఎక్కువే అయ్యిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే.. ఈ సినిమా (Movie) ప్రమోషన్స్ రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఈ మూవీ నుంచి పస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. దీనికి అనూహ్యమైన స్పందన వచ్చింది. అలాగే ఇప్పటి వరకు బిజినెస్ స్టార్ట్ చేయని మేకర్స్.. గ్లింప్స్ చూపించడంతో సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పుడు భారీ రేటుకు బిజినెస్ చేశారని తెలిసింది.

Naga Chaitanya

Naga Chaitanya | చైతూ కెరీర్ బెస్ట్ డీల్..

ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక.. ఈ మూడు రాష్ట్రాలకు కలిపి 45 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ (Business) జరిగిందట. ఈ మేరకు అగ్రిమెంట్స్ కూడా అయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఈ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ సొంతం చేసుకుందట. చైతూ కెరీర్ లో ఇంత పెద్ద మొత్తంలో బిజినెస్ జరగడం ఇదే తొలిసారి. ఇంకా ఓవర్ సీస్, నార్త్ ఇండియా, ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ బిజినెస్ జరగాల్సివుంది. ఇవి కాకుండానే థియేట్రికల్ బిజినెస్ ద్వారా 45 కోట్లు వస్తే.. నిర్మాత టేబుల్ ఫ్రాఫిట్స్ లోకి వెళ్లే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల్లో టాక్. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. మరి.. వృషకర్మతో చైతూ మరో బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.

Naga Chaitanya

Leave a Reply