హెచ్ టి పత్తి విత్తనాలు సాగు చేసినా.. విక్రయించినా కఠిన చర్యలు…

హెచ్ టి పత్తి విత్తనాలు సాగు చేసినా.. విక్రయించినా కఠిన చర్యలు…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నకిలీ పత్తి విత్తనాలు హెచ్డి పత్తి సాగుచేసిన విత్తనాలు విక్రయించిన కొనుగోలు చేసిన కఠిన చర్యలు తప్పవని ఊట్కూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని రైతు వేదిక భవనంలో ఆత్మ కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ హెచ్ టి పత్తి విత్తనాలు సాగు చేసేందుకు విక్రయించేందుకు మన దేశంలో అనుమతి లేదని అన్నారు.

రైతులు పత్తి విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో విధిగా జాగ్రత్తలు పాటించాలని లూజు విత్తనాలు కొనుగోలు చేయొద్దన్నారు. విత్తనాలు కొనుగోలు చేస్తే విధిగా రసీదు పొందాలని ప్రభుత్వం అనుమతి పొందిన లైసెన్సు ఉన్న ఆదికృత డీలర్ల వద్ద విత్తనాలు కొన్ని రోజులు చేయాలని సూచించారు. ప్రభుత్వ అనుమతి లేని జిల్లింగ్ మిల్లు లూజు పత్తి విత్తనాలు విక్రయించిన కొనుగోలు చేసిన చట్ట ప్రకారం చర్య తీసుకుంటామనిఅన్నారు.

రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనల మేరకు పంటలు సాగు చేయాలని నకిలీ పత్తి విత్తనాలు విక్రయించేందుకు దళారీలు గ్రామాల్లోకి వస్తే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. అనంతరం అమీన్ పూర్ క్లస్టర్ పరిధిలో ఎన్ ఎం ఎన్ ఎన్ఎఫ్ పథకం కింద ఎంపిక కావడంతో క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగేష్ ఉపసర్పంచ్ రవీందర్ రెడ్డి ఏఈఓ రజిత మాజీ ఎంపీటీసీ అనిత శేఖర్ రెడ్డి నాయకులు మొగల్ రెడ్డి ఎండి రఫీ తదితరులు పాల్గొన్నారు.