Beautification | నాణ్యతకు ప్రాధాన్యత నిస్తూ అభివృద్ధి పనులు…

Beautification | నాణ్యతకు ప్రాధాన్యత నిస్తూ అభివృద్ధి పనులు…

Beautification | గుడివాడ – ఆంధ్రప్రభ : నాణ్యత,మన్నికకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. అభివృద్ధి పనులకు, ఆక్రమణలు అడ్డువస్తే తొలగించాలని అధికారులకు ఆయన సూచించారు. గుడివాడ పట్టణం బైపాస్ రోడ్డుకు ఇరువైపులా రూ.1.46 కోట్ల నిధులతో జరుగుతున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులను, నాగవరప్పాడు వంతెన పై జరుగుతున్న బ్యూటిఫికేషన్ అభివృద్ధి పనులను మున్సిపల్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతి వివరాలను కమిషనర్ మనోహర్ ఎమ్మెల్యే రాముకు వివరించారు. ఆటంకం లేకుండా కీలకమైన డ్రైనేజీ పనులను త్వరగతిన పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు. నిర్మాణ పనులకు ఆక్రమణలు అడ్డువస్తే, తొలగించాలని అధికారులకు , చెప్పిన ఎమ్మెల్యే రాము, బ్యూటిఫికేషన్ పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ అలసత్వానికి తావు లేకుండా గుడివాడ పట్టణ వ్యాప్తంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా అభివృద్ధి పనుల్లో నాణ్యత,మన్నికకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

అందరి మంచి కోసం చేస్తున్న అభివృద్ధి పనులు,కొందరి స్వార్థం కారణంగా అవాంతరాలు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, పండ్రాజు సాంబయ్య, కంచర్ల సుధాకర్, పొట్లూరి కృష్ణారావు, గోకవరపు సునీల్, కడియాల గణేష్ , మరీదు రోహిణి, వేసపోగు సుందరయ్య, పురపాల సంఘ అధికారులు పాల్గొన్నారు.

CLICK HERE TO READ MORE : జాతీయ మహిళా సదస్సులో పాల్గొన్న కృష్ణకుమారి

CLICK HERE TO READ MORE :

Leave a Reply