అటెండర్ ఆత్మహత్య యత్నం..

అటెండర్ ఆత్మహత్య యత్నం..
నస్పూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ అధికారిణి వేధింపులను తట్టుకోలేక సోమవారం కార్యాలయ ప్రాంగణంలో ఆత్మహత్యకు యత్నించానని అదే శాఖలో అటెండర్ గ పనిజేస్తున్న బొల్లి శ్రీనివాస్ తెలిపారు. వ్యవసాయ అధికారిణి సురేఖ తనపై నిరంతరం వేధింపులకు పాల్పడుతున్నారని, మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు. తోటి ఉద్యోగులు స్పందించి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు ఆందోళచెందుతూ, బాధితుడి భార్య మీడియాతో మాట్లాడారు.
తన భర్త ఈ స్థితికి రావడానికి పూర్తిగా అధికారిని సురేఖ కారణమని ఆరోపించారు. తానే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. అనంతరం మెరుగైన చికిత్స కొరకు కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం శ్రీనివాస్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.ఈమేరకు నస్పూర్ పోలీస్ లు హాస్పిటల్ కు చేరుకొని విచారణ ప్రారంభించారు.
