మాజీ సీఎం జగన్ తో ఎన్టీఆర్ జిల్లా నాయకులు భేటీ

మాజీ సీఎం జగన్ తో ఎన్టీఆర్ జిల్లా నాయకులు భేటీ

  • తాడేపల్లిలో మర్యాదపూర్వక భేటీ
  • క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వక సమావేశం
  • జిల్లా రాజకీయ పరిస్థితులు, పార్టీ వ్యవహారాలపై చర్చ

విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడ సమీపంలోని తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యకలాపాలు జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

మాజీ సీఎం జగన్ ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నాయకులు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి వివిధ విషయాలపై చర్చించారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు నియోజకవర్గ స్థాయి సమస్యలపై కూడా ఈ సమావేశంలో అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిసింది.

Leave a Reply