ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రామయ్య గూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మంగళార నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వర్ణకుమార్ తో కలిసి ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల వసతులు సౌకర్యాలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సౌమ్యను రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే పేషంట్ల సంఖ్య వారి గల వసతులు తదితర అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
