గ్రానైట్ క్వారీ పనులకు అడ్డంకులు..

గ్రానైట్ క్వారీ పనులకు అడ్డంకులు..

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామ పరిధిలో ఈరన్న గుట్ట వద్ద గ్రానైట్ క్వారీ నిర్వహణకు ప్రభుత్వ అనుమతులు ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు పనులను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ క్వారీ యాజమాని బొల్లపల్లి కృష్ణ జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కోమల్ల గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 48 లో గల ప్రభుత్వ భూమిలో ఉన్న ఈరన్న గుట్ట ప్రదేశంలో గ్రానైట్ క్వారీ నిర్వహణ కోసం 2013లో వరంగల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ కు దరఖాస్తు చేసుకోగా, 26 ఫిబ్రవరి 2014న కోమల్లలో గ్రామ సభ నిర్వహించి ఎన్వోసీ జారీ చేసిం దని. 16 మే 2015న డైరెక్టర్ ఆప్ మైన్స్ అండ్ జియాలజీ వారు సర్వే నెంబర్ 48 లోని పది ఎకరాల భూమిలో 20 సం వత్సరాల పాటు గ్రానైట్ క్వారీ నిర్వహించుటకు ఫైనల్ గ్రాంట్ అర్థర్ జారీ చేసిందని వినతి పత్రంలో పేర్కొన్నారు.

ఇప్పటి వరకు ఎలాంటీ గ్రానైట్ క్వారీలో బ్లాకులు తీసే పనులను ప్రారంభించకున్న, ప్రభుత్వానికి సుమారు రూ.60 లక్షల రాయల్టీని ప్రభుత్వానికి అధికారికంగా చెల్లించానని వినతి పత్రంలో వివరించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 2023 నుండి 2043 వరకు గ్రానైట్ క్వారీ నిర్వహణకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తూ పనులను అడ్డుకుంటున్నారని, అడుకుంటున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని, గ్రానైట్ క్వారీ పనులు సవ్యంగా కొనసాగేందుకు సంబందిత అధికారులు సహకరించేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. క్వారీ పనులు సవ్యంగా కొనసాగేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.