Orders | ఎల్‌పీజీ ఉత్పత్తి పెంచాలి

Orders | ఎల్‌పీజీ ఉత్పత్తి పెంచాలి

కేంద్రం ఆదేశాలు..

Orders | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్ కొరత తీవ్ర సమస్యగా మారిన నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ కీలక చర్యలు చేపట్టింది. గృహ ఉపయోగం కోసం ఎల్‌పీజీ సరఫరా పెంచాలని, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టాలని ఆయిల్ కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

గృహ అవసరాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలని, హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలకు సరఫరాను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు శాఖ తెలిపింది. బుకింగ్‌కు 25 రోజుల పరిమితి విధించడం ద్వారా అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

Leave a Reply