3 districts | నిందితుల నుంచి సొత్తు స్వాధీనం…

3 districts | నిందితుల నుంచి సొత్తు స్వాధీనం…

3 districts |ఏలూరు, ఆంధ్రప్రభ : సుమారు సంవత్సరం కాలం నుండి నిందితులు ముదినేపల్లి, కలిదిండి, మండవల్లి, బంటుమిల్లి, పెడన, మొగల్తూరు, మరికొన్ని మండలాల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని ఇంటి తాళాలు పగలు కొట్టి ఇంటిలోఉన్న బంగారం, వెండి, డబ్బులు, విలువైన వస్తువులు దొంగతనాలకు, నేరాలకు పాల్పడ్డారు.

ఏలూరు జిల్లా సూపరింటెండెంట్ ప్రతాప్ శివకిశోర్, ఆదేశాల మేరకు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో, కైకలూరు రూరల్ సి.ఐ. వి.రవి కుమార్ ఆద్వర్యంలో ముదినేపల్లి పోలీస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని, స్థానిక సమాచారాన్ని విశ్లేషించి, నిందితులును గుర్తించి, విజయవంతంగా ఛేదించి, చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఇద్దరు నేరస్తులను సోమవారం నాడు ముదినేపల్లి వద్ద అరెస్ట్ చేసి, చోరీ చేసిన బంగారం, వెండి ఆభరణాలను, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

3 districts |

వీరు ఏలూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, 3 జిల్లాలలో నేరాలకు పాల్పడుతున్న‌ గొల్ల వంశీ తండ్రి (25), గుర్వాయిపాలెం గ్రామం, కలిదిండి మండలం, ఏలూరు జిల్లా, కాల దేవి వరప్రసాద్ (26), భాస్కరరావు పేట గ్రామం, కలిదిండి మండలం, వీరి వద్ద నుంచి దొంగిలించబడ్డ అనేక వస్తువులను స్వాధీన పరుచుకున్నారు. మొత్తం చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న బంగారు వస్తువులు సుమారు 200 గ్రాములు, (25 కాసులు), వెండి వస్తువులు సుమారు 3 కేజీలు, టీవీలు మూడు, గ్యాస్ సిలిండర్స్ 3 మోటార్ సైకిల్ 3 రికవరీ చేయగా రికవరీ చేసిన సొత్తు విలువ 45 లక్షల రూపాయలు గుర్తించినట్లు పోలీసులు అధికారులు తెలిపారు.

3 districts |

ఈ కేసులు ఛేదనలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులు, సిబ్బంది వి.రవి కుమార్, సి.ఐ. కైకలూరు రూరల్ సర్కిల్ వి.ఎస్.వి.భద్రరావు, ఎస్.ఐ. ముదినేపల్లి, వి.వెంకటేశ్వర రావు, ఎస్.ఐ. కలిదిండి, కానిస్టేబుల్ బి. నాగబాబు, పీ.నాగరాజు, పీ. పవన్ కుమార్, జీ.శివ కోటయ్య, పీ.వి. సత్యనారాయణ (డి.ఎస్.బి., సెల్ ట్రాక్, ఏలూరు) ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అభినందించారు.

3 districts |
3 districts |

Leave a Reply