t20| ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్
t20| ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్
వరుసగా రెండో సారి టీ20 వరల్డ్ కప్ కొట్టేసింది
అనే రికార్డులను సొంతం చేసుకున్న టీమిండియా
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను భారత్ చిత్తు చేసింది. సగర్వంగా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ మంచి జోరుమీద ఉంది. అయితే టైటిల్ గెలవడమే కాదు, ఈ మ్యాచ్‌తో అనేక రికార్డులను భారత్ బ్రేక్ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
- ఈ టోర్నీలో భారత్ ఏకంగా 106 సిక్సర్లు బాదింది.
- టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో ఒక జట్టు ఇన్ని సిక్సర్లు బాదడం ఇదే మొదటిసారి.
- ఫైనల్ మ్యాచ్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసి వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక పవర్ ప్లే స్కోరును నమోదు చేసింది.
- మొదటి 4 ఓవర్లలోనే జట్టు యాభై పరుగుల మార్కును భారత్ చేరుకుంది.
- టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచులలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును నెలకొల్పింది.
- అక్కడితో ఆగకుండా, కేవలం 44 బంతుల్లోనే (7.2 ఓవర్లలో) జట్టు సెంచరీ పూర్తి చేసింది.
- దీంతో నాకౌట్ మ్యాచులలో వేగవంతమైన వంద పరుగుల రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది.
- ఈ టోర్నీలో భారత్ ఏకంగా మూడుసార్లు 250కి పైగా స్కోర్లు సాధించింది.
- ఒకే ఎడిషన్‌లో అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన జట్టుగా నిలిచింది.
- ఈ వరల్డ్ కప్‌లో సంజు శాంసన్ 321 పరుగులు చేశాడు.
- ఒకే టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు.
- గతంలో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును సంజు అధిగమించాడు.
- ఫైనల్ మ్యాచులో 89 పరుగులు చేసిన సంజు, వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా మార్లన్ శామ్యూల్స్ (85) రికార్డును చెరిపివేశారు.
- ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో గెలిచింది.
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.
- భారత జట్టు ఈ విజయంతో తన మూడవ టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
- ప్రపంచంలో మూడు సార్లు ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా టీమ్ఇండియా రికార్డు సృష్టించింది.
- 2024లో టైటిల్ గెలిచిన భారత్, ఇప్పుడు మళ్లీ గెలిచి టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే వరుసగా రెండుసార్లు టైటిల్‌ను డిఫెండ్ చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది.
- సొంత గడ్డపై ఆడుతూ ప్రపంచకప్ గెలిచిన మొట్టమొదటి ఆతిథ్య దేశంగా కూడా భారత్ ట్రెండ్ సెట్ చేసింది.
