మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

రాప్తాడు, ఆంధ్రప్రభ : కుటుంబాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించడంలోనూ పిల్లలను పోషించడంలోనూ మహిళల పాత్ర చాలా కీలకమైనదని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాప్తాడు నియోజకవర్గ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబాలలో జరిగిన పలు వివాహా శుభ కార్యక్రమాలకు రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. రాప్తాడు మండల ఇన్చార్జి తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి ఇతర వైసీపీ నాయకులు ఎమ్మెల్యేతో పాటు ఉన్నారు.

Leave a Reply