రైతుల సమస్యల పరిష్కారమే బికేఎస్ లక్ష్యం
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; రైతుల సమస్యల పరిష్కారమే భారతీయ కిసాన్ సంగ్ లక్ష్యమని ఆ సంఘం రాష్ట్ర నాయకులు వెంకోబా, మండల నాయకులు మహిపాల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు జేగిరం నరసింహులు, మన్నే నాగార్జునఅన్నారు. ఆదివారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పగిడిమర్రిలో బి కే ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1955లో భారతీయ కిసాన్ సంఘాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు.
రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై నిరంతరంగా పోరాటం చేస్తూ రైతులను సంఘటితం చేస్తున్నామని అన్నారు. గ్రామాల్లో పంటల ఉత్పత్తి సేంద్రీయ వ్యవసాయం విద్యుత్ సమస్య వర్మి కంపోస్టు ద్వారా ఎరువుల వాడకం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. భూసారాన్ని పెంచేందుకు రైతులకు అవగాహన కల్పిస్తూ రసాయన ఎరువులు లేకుండా పశువుల ఎరువులతో పంటలు సాగు చేసే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు.
సేంద్రియ ఎరువుల వల్ల పంటలు పండించడంతో కలిగే లాభాలను వివరించారు. రైతులు కిసాన్ సంఘం చేపట్టే వివిధ కార్యక్రమాలకు సంఘీభావం పథకాలని పిలుపునిచ్చారు. భారతీయ కిసాన్ సంఘం కార్యక్రమాలపై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బస్వరాజ్ గౌడ్ నాయకులు కుర్వ బీరప్ప, విష్ణు మూర్తి గౌడ్, మొగులప్ప గౌడ్, శివప్ప, మన్నే బీరప్ప, వల్లంపల్లి సిద్ధప్ప, చిన్న వెంకటప్ప, చంద్రప్ప, రాగప్ప, నరసింహారెడ్డి, కాసిం పూజారి శరణప్ప తదితరులు పాల్గొన్నారు.
