ఆసుపత్రిలో మహిళా దినోత్సవ వేడుకలు…

ఆసుపత్రిలో మహిళా దినోత్సవ వేడుకలు…

కర్నూలు, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలులో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్పీ–2 బెటాలియన్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఎం. దీపిక పాటిల్ హాజరయ్యారు. మహిళల సాధికారత, ఆరోగ్య పరిరక్షణ, సమాజ నిర్మాణంలో మహిళల పాత్రపై ఆమె తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆసుపత్రికి చెందిన మహిళా వైద్యులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ పార్వతి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సరయు రెడ్డి, న్యూరాలజిస్ట్ డాక్టర్ రఘునందిని, అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ రేష్మా మహిళల ఆరోగ్య సంరక్షణ, జీవనశైలి, సమాజంలో మహిళల ప్రాధాన్యంపై మాట్లాడారు. వేడుకల్లో భాగంగా మహిళా సిబ్బందికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మెహందీ పోటీలు, హెయిర్ స్టైల్ పోటీలు, నృత్య కార్యక్రమాలు, మహిళల కోసం ప్రత్యేక ర్యాంప్ వాక్ నిర్వహించగా ఆసుపత్రి మహిళా సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

కార్యక్రమం ఆనందభరితంగా సాగి అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు యూనిట్ హెడ్ డాక్టర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో మహిళలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా వైద్యులు, సిబ్బంది తమ ప్రతిభతో సేవలందిస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

Leave a Reply