భాష్యం పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు..

భాష్యం పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు..

కర్నూలు, ఆంధ్రప్రభ : స్థానిక కర్నూలు శంకలబాగ్ భాష్యం పాఠశాలలో బ్రాంచ్ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు కర్నూల్ లోని విశ్వక్ గార్డెన్స్ లో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ రాయలసీమ జోనల్ ఇన్చార్జ్ అయిన అనిల్ కుమార్ , ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ మరియు హెచ్ఎం మాధవి సన్మానించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను తల్లిదండ్రులని ఉద్దేశించి టీజీ వెంకటేష్ భాష్యం విద్యా సంస్థలు విద్యార్థులకు క్రమశిక్షణ కూడిన విద్యను అందిస్తున్నారని తెలిపారు. కర్నూలు పట్టణంలో విద్యతో పాటు క్రీడల్లోనూ అలానే సాహిత్య కార్యక్రమంలో భాష్యం పాఠశాల ముందుండి నడిపిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా టౌన్ మోడల్ లో భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్ట్ మీద కట్టిన ఆడిటోరియంని గుర్తు చేశారు.

ఈ వార్షికోత్సవంలో జీ. అనిల్ కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు కర్నూలు భాష్యం పాఠశాలకు ఎంతో తోడ్పడి ముందుండి ప్రతి విషయంలో సహకరిస్తున్నారని ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీ వెంకటేష్ విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు ఈ కార్యక్రమం విద్యార్థులు చేసిన సాహిత్య కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని అభినందించారు.

Leave a Reply