ఉప్లూర్ లో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రెండవ రోజు కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పరిశుభ్రత పనులను శనివారం చేపట్టారు.అందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో భాగంగా ప్రజల సంక్షేమం పర్యావరణ పరిరక్షణ కోసం ఎనలేని కృషి చేసి ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం కృషి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి ఎంపీడీఓ చింత రాజా శ్రీనివాస్, ఎంపిఓ సదాశివ్, ఈజిఎస్ఎపిఓ విద్యానంద్,పాఠశాల హెచ్ ఎం రాజన్న,గిరిధర్,వార్డ్ మెంబెర్ రాకేష్, నాయకులు నరేష్,ఎఫ్ఏ అశ్వపతి పంచాయితీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply