పర్యావరణ పరిరక్షణకు సీడ్ బాల్స్ తయారీ
బోధన్ రూరల్, ఆంధ్రప్రభ: బోధన్ మండలంలోని అంమ్దాపూర్ గ్రామ పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో సీడ్ బాల్స్ తయారు చేయించారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయులు సూర్యకుమార్ తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేశారు.
విద్యార్థులు తయారు చేసిన సీడ్ బాల్స్‌ను తమ ఇళ్ల పరిసరాలతో పాటు గ్రామంలోని ఖాళీ ప్రదేశాల్లో చల్లడం ద్వారా మొక్కల పెంపకానికి దోహదపడతాయని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
