JNTU | చట్టాలను క్షేత్రస్థాయిలో అమలుచేయాలి…

JNTU | చట్టాలను క్షేత్రస్థాయిలో అమలుచేయాలి…

JNTU | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మహిళల సాధికారత, రక్షణ, అభ్యున్నతి కోసం చట్టాలు చేయడమే కాకుండా వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడమే ప్రభుత్వాల నిజమైన బాధ్యత అని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇవాళ హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ (JNTU)లో నిర్వహించిన ‘స్టాండ్ విత్ హర్’ (Stand With Her) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ మాట్లాడుతూ… రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, అందుకే తమ ప్రభుత్వం మహిళల ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు శక్తి, మేర పదవులు కట్టబెట్టడమే కాకుండా, ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల పేరు మీదే అందిస్తున్నామని ఆయన గుర్తు చేశారు.

Leave a Reply