Mokshagna | క్రేజీ మూవీ ప్రారంభం ఎప్పుడు..?
Mokshagna | క్రేజీ మూవీ ప్రారంభం ఎప్పుడు..?
Mokshagna | మోక్షజ్ఞ తొలి సినిమా ఎప్పుడు ప్రారంభం..?
ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది..?
దర్శకుడు క్రిష్ తో మోక్షజ్ఞ ఎంట్రీ..?
హీరోయిన్ కోసం ఆడిషన్స్
ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభం..?
Mokshagna | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నందమూరి బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి రావడం.. తెలిసిందే. ఈపాటికే ఈ క్రేజీ మూవీ సెట్స్ పై ఉండాలి. ఇంకా చెప్పాలంటే.. ఈపాటికే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ రిలీజై (Movie Release) ఉండాలి కానీ.. కొన్ని కారణాల వలన అలా జరగలేదు. ఇప్పుడు మరోసారి మోక్షజ్ఞ సినిమా గురించి న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ.. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఎవరితో..? ఎప్పుడు ప్రారంభం..?

Mokshagna | ఊహించని విధంగా..
మోక్షజ్ఞ సినిమా రంగంలో ఎంట్రీ గురించి వార్తలు అయితే వస్తున్నాయి కానీ.. ప్రాజెక్ట్ పట్టాలెక్కడం లేదు. దీంతో నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ తొలి సినిమాని స్టార్ట్ చేస్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ తొలి సినిమా (Movie) చేయనున్నట్టుగా అనౌన్స్ చేసిన తర్వాత.. ఇక త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తారనుకుంటే.. ఊహించని విధంగా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఆతర్వాత నుంచి ఈ క్రేజీ మూవీ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే.. ఈ సినిమా గురించి ప్రీ ప్రొడక్షన్ జరుగుతుందని వార్తలు రావడం ఆసక్తిగా మారింది.

Mokshagna | ఏప్రిల్ లో సెట్స్ పైకి..
ఈ క్రేజీ మూవీని క్రిష్ తెరకెక్కించనున్నారని న్యూస్ వినిపిస్తోంది. అయితే.. ఆమధ్య క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని ప్రచారం జరిగింది. క్రిష్ తెరకెక్కించిన ఘాటి సినిమా ఫ్లాప్ అవ్వడంతో.. బాలయ్య ఆలోచన మారిందని.. క్రిష్ (Krish) కాకుండా వేరే డైరెక్టర్ తో ఈ సినిమా చేయించే ప్లానింగ్ జరుగుతుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. మళ్లీ క్రిష్ పేరు గట్టిగా వినిపిస్తుంది. ఇప్పుడు క్రిష్ ఆర్టిస్టులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్స్ చేస్తున్నారని.. ఈ భారీ, క్రేజీ మూవీని ఏప్రిల్ లో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి.. త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

