స్వీపర్ కుటుంబానికి ఆర్థిక సహాయం..

స్వీపర్ కుటుంబానికి ఆర్థిక సహాయం..

కడెం (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : కడెం మండలంలోని నచ్చని ఎల్లాపూర్ గ్రామంలో గల తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల పాఠశాలలో నాగిళ్ల లక్ష్మి స్వీపర్ గా విధులు నిర్వహిస్తోంది. కాగా ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు వైద్య చికిత్స నిమిత్తం నిజామాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాలని అందుకు సుమారు పది లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ శకుంతల, సిబ్బంది, విద్యార్థులు కలిసి 14 వేల రూపాయల నగదు ఆర్థిక సాయం నాగిళ్ల లక్ష్మి కుటుంబానికి అందజేశారు. దాతలు ఎవరైనా మానవత్వంతో ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించి నాగిళ్ల లక్ష్మి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానిక గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ శకుంతల కోరారు.

Leave a Reply