Section 307 | అడ్డు వ‌చ్చిన భార్య‌ను కూడా….

Section 307 | అడ్డు వ‌చ్చిన భార్య‌ను కూడా….

ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కబర్థి తీర్పు
కీలకంగా వ్యవహరించిన పోలీసులను అభినందించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్

Section 307 | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : గత 2021 ఫిబ్రవరి 22న జరిగిన హత్య, హత్యాయత్నం కేసులో నిందితుడు దగ్గుబాటి రాజును కోర్టు దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ మేరకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కబర్థి సోమవారం తీర్పు వెలువరించారు.

Section 307 | ఘటన వివరాలు…

షరీఫ్ నగర్ (కల్లూరు మండలం)కు చెందిన వడ్డి పాటి వెంకటేశ్వర్లు (తండ్రి: వి. రామస్వామి) తన నివాసం వద్ద ఉండగా, నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ఇందిరేశ్వరం గ్రామానికి చెందిన దగ్గుబాటి రాజు (తండ్రి: డి. చిన్నస్వామి) కక్షతో కత్తితో దాడి చేశాడు. రాజు భార్య వివాహేతర సంబంధం కారణంగా వెళ్లిపోయిందన్న అనుమానం, అలాగే హతుడు పొలం అమ్మకానికి వచ్చిన డబ్బుల్లో రూ.2 లక్షలు ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ దాడిలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మరణించగా, అడ్డొచ్చిన భార్య వడ్డి పాటి పుష్పరాణిపై కూడా హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనపై అదే రోజు కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

దర్యాప్తు, విచారణ.. అప్పటి దర్యాప్తు అధికారి శ్రీనివాస్ రెడ్డి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించి, ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ కేసును ప్రాధాన్యంగా తీసుకుని నిరంతర మానిటరింగ్ చేశారు. ప్రస్తుత 4వ పట్టణ సీఐ విక్రమసింహ, సెషన్స్ కోర్టు కానిస్టేబుల్స్ వెంకటరమణ, ఈశ్వర్ సాక్ష్యాలను సమయానికి ప్రవేశపెట్టగా, ప్రభుత్వ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంగా రవి వాదనలు వినిపించారు.

Section 307 | కోర్టు తీర్పు…

నిందితుడు దగ్గుబాటి రాజు పై నేరం రుజువు కావడంతో సెక్షన్ 235(2) Cr.P.C ప్రకారం దోషిగా నిర్ధారించారు. సెక్షన్ 302 IPC కింద జీవిత ఖైదు మరియు రూ.5,000 జరిమానా సెక్షన్ 307 IPC కింద 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.5,000 జరిమానా విధించారు. రెండు శిక్షలను ఒకేసారి అనుభవించాలని కోర్టు ఆదేశించింది.

జరిమానా చెల్లించనిచో అదనంగా 6 నెలల సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఎస్పీ అభినందనలు… ఈ కేసులో నిందితుడికి శిక్ష పడడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు, సిబ్బందిని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. న్యాయం సాధించడంలో పోలీసుల కృషి ఫలించిందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply