Rafael Grossi | సురక్షితమే…

Rafael Grossi | సురక్షితమే…

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో ఇరాన్‌లోని అణు కేంద్రాలకు ఎటువంటి నష్టం జరగలేదని అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (ఐఏఈఏ) అధిపతి రఫేల్ గ్రోసీ (Rafael Grossi) తెలిపారు. బుషెహెర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, టెహ్రాన్ రీసెర్చ్ రియాక్టర్ తో పాటు ఇతర అణు కేంద్రాలు సురక్షితంగా ఉన్నాయని తెలిపారు.

అయితే నతాంజ్ న్యూక్లియర్ కేంద్రం (Natanz Nuclear Center) పై దాడి జరిగినట్లు ఐఏఈఏకు చెందిన ఇరాన్ అంబాసిడర్ రీనా నజాఫి పేర్కొన్నప్పటికీ, పూర్తి వివరాలు వెల్లడించలేదు. పశ్చిమాసియాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో, అన్ని దేశాలు సంయమనం పాటించాలని తెలిపారు. ఇరాన్ న్యూక్లియ‌ర్ రెగ్యులేట‌రీ అథారిటీ (Iran Nuclear Regulatory Authority)తో సంప్ర‌దించే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని, కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి రెస్పాన్స్ రాలేద‌ని, అమెరికా, ఇజ్రాయిల్‌, ఇరాన్ సైనిక ఆప‌రేష‌న్స్ వ‌ల్ల న్యూక్లియ‌ర్ సైట్ల‌కు ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా చూసుకోవాల‌ని ర‌ఫేల్ గ్రోసీ పిలుపునిచ్చారు.

Leave a Reply