చంద్రగ్రహణం కారణంగా…

చంద్రగ్రహణం కారణంగా…

శ్రీశైలం మహానంది యాగంటి అహోబిలం ఓంకారం వంటి పుణ్యక్షేత్రాలలో…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా లోని ప్రముఖ దేవాలయ పుణ్యక్షేత్రాలలో శ్రీశైలం మహానంది యాగంటి అహోబిలం ఓంకారం వంటి క్షేత్ర ఈనెల మూడవ తేదీన చంద్రగ్రహణం కారణంగా అన్ని దేవాల యాల ముఖ ద్వారాలు మూసివేస్తున్నట్లు ఆయా దేవాలయాల నిర్వాహకులు తెలిపారు. శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీన ఉదయం 6 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేయబడతాయని నిర్వహణ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.

ఈ కారణంగా ఆలయంలోని అన్ని ఆర్జితసేవలు, పరోక్షసేవలు, శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం టికెట్లు పూర్తిగా నిలుపుదల చేయబడ్డాయన్నారు.. అదే విధoగానే సాక్షిగణపతి, హాఠకేశ్వరం–ఫాలధార – పంచధార, శిఖరేశ్వరం మొదలైన పరివార ఆలయాల ద్వారాలను కూడా మూసివేయడం జరుగుతుందన్నారు. దేవస్థాన దత్తత దేవాలయాలలో కూడా యిదేవిధంగా ఆలయ ద్వారాలు మూసివేయబడుతాయన్నారు. 3వ తేదీ ఉదయం 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి మంగవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాత: కాలపూజలు, మహామంగళహారతులు జరిపించబడుతాయన్నారు.

మహామంగళహారతుల సమయం అనగా గం. 4. 30ల నుంచి గం. 5.30 గంటల వరకు మాత్రమే భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం, అమ్మవారి దర్శనం కల్పించబడుతుందన్నారు. అనంతరం ఉదయం 6 గంటలకు శ్రీస్వామిఅమ్మవార్ల ఆలయద్వారాలను మూసివేయ బడుతాయన్నారు. తిరిగి రాత్రి గం. 7.30లకు ఆలయ ద్వారాలను తెరచి ఆలయశుద్ధి, మంగళ వాయిద్యాలు, సుసాంధ్యం, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి రాత్రి గం.9.00లకు శ్రీ స్వామిఅమ్మవార్ల మహామంగళ హారతులు జరిపించబడుతాయన్నారు .మహామంగళహారతుల సమయం నుంచే అనగా రాత్రి 9 గంటల నుండి రాత్రి గం. 10.30ల వరకు భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం, శ్రీఅమ్మవారి దర్శనం కల్పించబడుతాయన్నారు.

గ్రహణం కారణంగా మార్చి 3వ తేదీన అన్నప్రసాదవితరణ కూడా నిలుపుదల చేయబడిందన్నారు.భక్తులు ఈ విషయాలు గమనించలని వారు కోరారు. జిల్లాలోని మహానందియాగంటి ఓంకారం మహోభిలం అంటే పుణ్యక్షేత్రాలలో కూడా చంద్ర గ్రహణం రోజున అన్ని దేవాలయాల ముఖ ద్వారాలు మూసి వేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply