కరాటే పోటీలలో.. విద్యార్థుల ప్రతిభ..

కరాటే పోటీలలో.. విద్యార్థుల ప్రతిభ..

లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్మల్ లో నిర్వహించిన కరాటే పోటీలలో మండలంలోని వాణి పాఠశాల విద్యార్థులు ప్రతిభని చాటారు. శ్రీహన్, విష్ణు, కీర్తివర్ధన్, మధుకర్, నిహాల్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఎల్లో బెల్ట్ సాధించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ పి. గంగాధర్ తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులను ఘనంగా సన్మానించారు.

Leave a Reply