30 years | గ్రామ మ‌లుపు వ‌ద్ద‌…

30 years | గ్రామ మ‌లుపు వ‌ద్ద‌…

30 years | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ధనుర బి పరిసర ప్రాంతంలో మలుపు వద్ద మామిడి చెట్టును ఢీకొని అత్త, అల్లుడు ఘటన స్థలంలోని మృతి చెందారు. అదిలాబాద్ నుండి ఉట్నూర్ వైపు వస్తున్న పల్సర్ ద్విచక్ర వాహనంతో ధనుర బీ గ్రామ సమీపాన పిప్పిరి గ్రామ మలుపు వద్ద మామిడి చెట్టును అధువు తప్పి ఢీ కొట్టడంతో అక్కడి కక్కడే ఇద్ద‌రు మృతి చెందారు.

ఆదిలాబాద్ కొమురం భీం కాలనీకి చెందిన ఆడ విజయ్ దాదాపు 30 సంవత్సరాలు, అతని అత్త నైతం జంగు భాయ్ w/o నైతం లేతూ 65 సంవత్సరాలు ఆదివాసులు. సాలె గుడా గ్రామానికి చెందిన ఆమె తన అల్లునితో ఉట్నూర్ వైపు పల్సర్ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా అదుపు తప్పి మామిడి చెట్టును ఢీకొనడంతో ఘటన స్థలంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఎ యస్ ఐ నాగేశ్వరరావు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Leave a Reply