ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి

మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం జౌళాపురం గ్రామ బీజేపీ నాయకులు గత సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డిని మా గ్రామానికి జక్లేర్ వెళ్ళే రహదారి గుంతలమయమైందని మరమ్మతులు చేయాలని కోరగా బీజేపీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తే ఖచ్చితంగా సొంత నిధులతో మరమ్మత్తు చూపిస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం రోజు భూమిపూజ చేసి మరమ్మతుల పనులును బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి ప్రారంభించారు.

అదేవిధంగా సామాన్ పల్లి, కాట్రేవుపల్లి గ్రామాల్లో హైమాక్స్ లైట్ల ఏర్పాటుకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సొంత నిధులతో పనులు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని అన్నారు. పాలమూరు పార్లమెంటు సభ్యులు డీకే అరుణమ్మ నాయకత్వంలో ప్రత్యేక నిధులు తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.

నూతనంగా ఎన్నికైన సర్పంచులు వార్డు సభ్యులు గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేయాలని ఆయన సూచించారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా సమస్యల పరిష్కారానికి తనవంతు పూర్తి సహకారం అందజేస్తానని బీజేపీ రాష్ట్ర నాయకులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో జౌళాపురం సర్పంచ్ మహాదేవమ్మ. బాలకిస్టప్ప, ఉపసర్పంచ్ హన్మంతు, బీజేపీ మక్తల్ మండల అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, నారాయణ పేట జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీరామ్, జాక్లేర్ శేఖర్ రెడ్డి, నర్వ మండల బీజేపీ నాయకులు మాజీ ఎంపీటీసీ నీరజ్, నర్వ మండల ప్రధాన కార్యదర్శి విజయ్ రామ్ (లంకల్ ఉప సర్పంచ్) కోశాధికారి నాగన్న గారి యాదవ రెడ్డి, బీజేపీ నాయకులు రాంపురం నరసింహ,చాకలి బోజన్న, పల్లె రాంరెడ్డి, వాసా సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply