శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు

శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ పట్టణంలోని ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా లింభాచల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవ స్థానంలో ఆదివారం టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ నా శెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బెజ్జోర గ్రామ సర్పంచ్ మెస్ కార్తీక్, ఉప సర్పంచ్ లింబయ్యలతో కలిసి గుట్టపైకి చేరుకుని స్వామివారి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.
జిల్లా ప్రజల శాంతి, సౌఖ్యం, గ్రామా భివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక అర్చనలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ నంభి లింబాద్రి శర్మ వారికి దీక్షా వస్త్రాలతో సన్మానం చేసి, స్వామివారి ఆశీర్వాదాలు అందజేసి తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సుమన్ కుమార్ మాట్లాడుతూ భక్తి, విశ్వాసాలు మనసుకు ఆధ్యాత్మిక శాంతిని ఇచ్చి సమాజ అభ్యున్నతికి దోహదపడతాయని పేర్కొన్నారు.

దేవాలయాల అభివృద్ధికి అందరూ సహకరించాలని సూచించారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, భీమ్‌గల్ యూనిట్ అధ్యక్షులు సృజన్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు, గ్రామ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
