రాష్ట్ర కార్యదర్శిగా అనుమకొండ గౌరీ ప్రసాద్

రాష్ట్ర కార్యదర్శిగా అనుమకొండ గౌరీ ప్రసాద్
పెడన, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ( ఏపీపీఎస్ఏ) రాష్ట్ర కార్యదర్శిగా విశ్వ భారతి హై స్కూల్ వ్యవస్థాపకులు, ప్రిన్సిపల్ అనుమకొండ గౌరీ ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి నూతన కార్య వర్గ ఎన్నికను నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా పెడన పట్టణంలోని విశ్వభారతి హైస్కూలు ప్రిన్సిపాల్ అనుమకొండ గౌరీ ప్రసాద్ ను( అప్స) రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
ఈయనతోపాటు రాష్ట్ర అధ్యక్షులు వి ఎస్ రాజు, రాష్ట్ర కౌన్సిల్ కో చైర్మన్ మేకల రవీంద్ర, వి.సుందరం రాష్ట్ర కార్యదర్శి ఎంపికయ్యారు. అసోసియేషన్ లో డివిజన్ స్థాయి నుండి జిల్లా స్థాయిలో అనేక పదవుల ద్వారా విశిష్ట సేవలు అందించినందుకు ఈ పదవి లభించినట్లు గౌరీ ప్రసాద్ తెలిపారు. ప్రైవేట్ విద్యా సంస్థల అభివృద్ధికి, సభ్యులకు మరింతగా సేవలు అందిస్తానని గౌరీ ప్రసాద్ తెలిపారు. అప్స రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన గౌరీ ప్రసాద్ ను అసోసియేషన్ రాష్ట్ర జిల్లా నాయకులు వి.డి ఎస్ ప్రసాద్, సాబు, జాన్, అజ్మతుల ఖాన్, పలువురు విద్యావేత్తలు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
