9471 people | రూ.18.07 కోట్ల పింఛన్లు

9471 people | రూ.18.07 కోట్ల పింఛన్లు
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
కేతనకొండలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేత
9471 people | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ భరోసా పథకం కింద మైలవరం నియోజకవర్గంలో 41,954 మందికి రూ.18.07 కోట్ల పింఛన్ల సొమ్మును పంపిణీ చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లను శనివారం ఆయన లబ్ధిదారులకు అందజేశారు.
రెడ్డిగూడెం మండలంలో 7,125 మందికి రూ.3,03,84,000లు, మైలవరం మండలంలోని 9471 మందికి రూ.4,07,96,000లు, విజయవాడ రూరల్ మండలంలోని 6,957 మందికి రూ.3,02,93,500లు, జి.కొండూరు మండలంలోని 8,472 మందికి రూ.3,61,65,000లు, ఇబ్రహీంపట్నం మండలంలోని 4,719 మందికి రూ.2,02,16,500లు, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5,210 మందికి రూ.2,28,52,000లు మంజూరయ్యాయని చెప్పారు.
మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా 51 మందికి స్పౌజ్ కేటగిరి కింద మార్చి నెలకు నూతన పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెంచిన సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారుల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎన్డీయే కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
