రామ్మూరి నాయుడుకు నివాళులు….
రామ్మూరి నాయుడుకు నివాళులు….
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు జయంతి సందర్భంగా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి టీడీపీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శ్రద్ధాంజలి ఘటించారు.
రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా సేవలందించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు సోదరులు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పాల్గొని రామ్మూర్తి నాయుడు సేవలను స్మరించుకున్నారు. ఆయన ప్రజాసేవ, పార్టీ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు.

