march 4| మోదీకి విజ‌య్ దేవ‌రకొండ‌, ర‌ష్మిక ఆహ్వానం

march 4| మోదీకి విజ‌య్ దేవ‌రకొండ‌, ర‌ష్మిక ఆహ్వానం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : స్టార్ న‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మికలు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. వారిరువురు గురువారం ఉద‌య్ పూర్ వేదిక‌గా ఏడ‌డుగులు వేశారు. ఈ వేడుక అతి కొద్ది మంది స‌న్నిహితుల స‌మ‌క్షంలోనే గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ తాజ్ కృష్ణాలో మార్చి 4, బుధ‌వారం రిసెప్ష‌న్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

అయితే ఈ వేడుక‌కు హాజ‌రు కావాల‌ని భారత ప్రధాని నరేంద్రమోదీని విజయ్‌, రష్మిక క‌లిసి ఆహ్వానించారు. ప్రధానితో వీరిద్దరూ ఉన్న ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ రిసెప్షన్‌ కోసం ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్‌ షాతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులను విరోష్‌ జోడీ ఆహ్వానించింది. హైదరాబాద్‌లోని తాజ్‌ హోటల్‌ ఈ వేడుకకు వేదిక కానుంది. దీనికి భారీగా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

Leave a Reply