Andhra king taluka | గర్వపడే సినిమా..

Andhra king taluka | గర్వపడే సినిమా..

Andhra king taluka, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ట్రైలర్ సినిమా పై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్ లో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ లో రామ్ (Hero Ram) మైండ్ బ్లోయింగ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ అందరినీ మెస్మరైజ్ చేసింది.

మ్యూజిక్ కాన్సర్ట్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మాట్లాడుతూ.. హలో వైజాగ్. నా కెరీర్ లో గర్వపడే సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా ఇంత బ్యూటిఫుల్ గా రావడానికి చాలా మంది కష్టం ఉంది. రవి గారు, నవీన్ గారు చాలా పాషన్ వున్న ప్రొడ్యూసర్స్. టిఓపి జార్జ్ సిద్ధార్థ ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చారు. వివేక్ మార్విన్ తెలుగు సినిమాకి ఒక కొత్త సౌండ్ తీసుకొచ్చారు. ఈ ఆల్బం గుండెల్లో నిలిచిపోతుంది. ఇది వారి ఆరంభం మాత్రమే. తెలుగు ఇండస్ట్రీకి చాలా రోజుల తర్వాత గ్లామర్ తో పాటు మంచి పర్ఫార్మ్ చేసే హీరోయిన్ భాగ్యశ్రీ వచ్చింది. ఇటీవల వచ్చిన సినిమాలో కూడా తను అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చింది. ఏదైనా కొత్తగా చేయాలనుకున్నప్పుడు మహేష్ నా జీవితంలోకి వచ్చాడు.

తనతో వర్క్ చేయడం మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మహేష్ లాంటి హానెస్ట్ ఫిలిం మేకర్స్ తెలుగు సినిమాకి కావాలి. తను ఎంతో గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. పాతికేళ్ల క్రితం చనిపోవాలనుకున్న ఓ వ్యక్తి, ఉపేంద్ర గారి సినిమా చూసి తన మనసు మార్చుకుని ధైర్యంగా నిలబడి ఒక కంపెనీ పెట్టి వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అది ఒక సినిమాకి ఒక అభిమానానికి ఉన్న శక్తి. ఉపేంద్ర గారితో కలిసి పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. మై డియర్ ఫ్యాన్.. జీవితంలో పైకి రావాలంటే పాషన్, పర్పస్ ఉండాలి. నా పర్పస్ మీరే. ఇక్కడ టన్నులు టన్నులు ఉంది. వస్తున్నాం.. లెగుస్తున్నాం.. మళ్ళీ కొడుతున్నాం. హోంమంత్రి గారికి (Home minister anitha), పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అభిమానులందరికీ ధన్యవాదాలు. ఆంధ్ర కింగ్ తాలూకా 27న రిలీజ్ అవుతుంది. అందరం థియేటర్స్ లో కలుద్దాం అన్నారు.

రియల్ స్టార్ ఉపేంద్ర (Upendra) మాట్లాడుతూ.. ఏ, ఉపేంద్ర, రక్తకన్నీరు ఈ సినిమాలన్నీ మీకు గుర్తు ఉండడం చాలా ఆనందంగా ఉంది. సినిమా చుసిన వ్యక్తిగా ఒక మాట చెప్తున్నాను. ఈ సినిమా చూసి మీరు అందరూ కాలర్ ఎగరేసుకుంటూ బయటికి వస్తారు. మహేష్ గారు సినిమాని అద్భుతంగా చేశారు. ఎలివేషన్ కమర్షియల్ సాంగ్స్ లవ్వు అన్నీ ఉన్నాయి. రామ్ గారు, భాగ్యశ్రీ గారు అద్భుతమైన కాంబినేషన్. రామ్ గారి ఎనర్జీ ఈ సినిమాలో చూడండి. మీ ఫ్యాన్స్ అందరి ఎనర్జీ అక్కడ ఉంది. మైత్రి నవీన్ గారికి రవి గారికి చాలా థ్యాంక్యూ. మీ అభిమానానికి ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమాని మీరందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలి అన్నారు.

హీరోయిన్ భాగ్యశ్రీ (bhagya sri borse) మాట్లాడుతూ .. హలో వైజాగ్. ఈవెంట్ కి వచ్చినా అందరికీ థాంక్యూ. నా చిన్ని గుండెలో చాలా ఆశలతో ఇక్కడికి వచ్చాను. మీ అందరి అభిమానానికి ధన్యవాదాలు. రామ్ గారు అభిమానుల్ని ఎంతగానో ప్రేమించే హీరో. ఆయన కింగ్ ఆఫ్ హార్ట్స్. మీ అందరి ప్రేమకు ఆయన అర్హులు. నవంబర్ 27న అందరూ కూడా ఈ సినిమాని చూడాలని కోరుతున్నాను అందరికీ థాంక్యు అన్నారు.

హోం మినిస్టర్ వంగలపూడి అనిత (Home minister anitha) మాట్లాడుతూ.. ఆంధ్ర కింగ్ తాలూకా ఈ టైటిల్ వినగానే చాలా కనెక్ట్ అయ్యాను. ఎలక్షన్స్ టైం లో మంగళగిరి ఎమ్మెల్యే తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనేవి చాలా ప్రజాదరణ పొందిన టైటిల్స్. ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. మైత్రి మూవీ రవి గారికి, నవీన్ గారికి అభినందనలు. వైజాగ్ సముద్ర తీరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ సినిమాని ప్రమోట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఉపేంద్ర గారు అద్భుతమైన నటనతో తెలుగులో కూడా ఎంతో గొప్ప అభిమానం సంపాదించుకున్నారు. భాగ్యశ్రీ నటన ఎంతో ఆకట్టుకుంది. మీ అందరి అభిమాన హీరో రామ్. తనని సినిమాలో చూసేటప్పుడు తన స్ప్రింగ్ పెట్టుకున్నాడా అనిపించేది. తను డాన్స్లు ఎంతో పర్ఫెక్ట్ గా చేస్తాడు. రామ్ కి అభినందనలు. ఈ సినిమా దర్శకుడు మహేష్ వైజాగ్ వాసి అవ్వడం గర్వపడుతున్నాం. సినిమాకి పని చేస్తున్న అందరికీ పేరు పేరునా అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.

డైరెక్టర్ మహేష్ బాబు (Mahesh Babu) మాట్లాడుతూ.. నేను సినిమా తీయడం హైదరాబాదులో నేర్చుకున్నాను కానీ సినిమాలో ఉండే ప్రతి ఎమోషన్ వైజాగ్ లోనే ఫీలయ్యాను. రవి గారికి కథ చెప్పినప్పుడు ఆయన నన్ను హగ్ చేసుకున్నారు. అప్పుడే కంటెంట్ మీద మరింత నమ్మకం వచ్చింది. ఈ సినిమా టీం వర్క్. రైటింగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి థాంక్యూ. సినిమా కోసం రాత్రి పగలు పని చేశారు. మా సినిమాకి పని చేసిన ప్రతి టెక్నీషియన్ కి పేరుపేరునా ధన్యవాదాలు. వివేక్ మర్విన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన మ్యూజికే మా ఫస్ట్ సక్సెస్ గా ఫీల్ అవుతున్నాము. రావు రమేష్ గారు మురళీశర్మ, రాహుల్ రామకృష్ణ, సత్య రాజీవ్ కనకాల గారు ఇలా ఎంతో మంది అద్భుతమైన నటులు అందరు కూడా తమ పాత్రలని ఎక్స్ట్రాడినరీగా చేశారు.

వాళ్ల ముందున్న సినిమాలు కంటే కొత్తగా చేశారు. మేము అనుకున్న దాని కంటే 100 టైమ్స్ అద్భుతంగా చేసింది భాగ్యశ్రీ. ఒక డైరెక్టర్ ని డైరెక్ట్ చేయడం చాలా కష్టమైన పని. ఉపేంద్ర గారి దగ్గరికి చాలా భయంతో వెళ్ళాను. ఆయన రియల్ మాన్. ఆయన సపోర్ట్ ని మర్చిపోలేను. రామ్ లేకపోతే సినిమా లేదు. సినిమా పట్ల అంత ఫ్యాషన్ అన్న వారిని నేను ఇప్పటి వరకూ చూడలేదు. ఆయనకు ఉన్న సినిమా నాలెడ్జ్ అద్భుతం. ప్రపంచంలో ఎవర్నో ఒకరిని అభిమానించకుండా ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. లైఫ్ లో ఎన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయో ఒక ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూపిస్తే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా. నవంబర్ 27న అందరు కూడా సినిమా థియేటర్స్ లో చూస్తారని కోరుకుంటున్నాను అన్నారు.