sad news| రింకూసింగ్ తండ్రి క‌న్నుమూత‌

ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : భారత విధ్వంసక బ్యాట్స్‌మన్ రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న తండ్రి ఖాన్‌చంద్ సింగ్ కన్నుమూశారు. నాలుగో దశ కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గ్రేటర్ నోయిడాలోని యాథర్త్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చాలా రోజులుగా వెంటిలేటర్‌లో ఉన్నారు. నిరంతరం మూత్రపిండ మార్పిడి చికిత్స పొందుతున్నారు. తన తండ్రి పరిస్థితి విషమంగా ఉండటంతో రింకు సింగ్ టీ20 ప్రపంచ కప్ నుంచి మధ్యలోనే నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే, ఫిబ్రవరి 26న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ కు ముందు అతను తిరిగి భారత జట్టులో చేరాడు. తన తండ్రి మరణం తర్వాత అతను తిరిగి వెళ్లిపోయాడు. రాబోయే మ్యాచ్‌లలో అతను ఆడగలడా లేదా అనే దానిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు.

Leave a Reply