జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..

మోపిదేవి, ఆంధ్రప్రభ : జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఇన్నోవా కారు అతివేగంగా ఢీకొట్టడంతో ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. జాతీయ రహదారిపై ఇటీవల ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేయడం మాత్రం వాహనదారులు మానుకోవడం లేదు. బస్సు ముందు చక్రం భాగం పార్టీ డ్యామేజ్ జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Leave a Reply