విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి…

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి…

కుంటాల, ఆంధ్రప్రభః విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఆదేశించారు. గురువారం మండల కేంద్రమైన ఆదర్శ పాఠశాలల్లో గల హాస్టల్ వసతి గృహాన్ని పరిశీలించారు. అంతేకాకుండా కల్లూరు కస్తూరిబా గాంధీ విద్యాలయంలో పరిశీలించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులతో . సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆరు రోజుల పాటు నిర్దేశించిన మెనూ ప్రకారం సుచి, శుభ్రతతో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు వడ్డించాలని చెప్పారు. పరిసరాలను పరిశీలన చేశారు హాస్టల్లోని కూరగాయలను వంట సామాగ్రిని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నిర్వహిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.

మెనూ ప్రకారం భోజనం సక్రమంగా అందించాలని ఆహార పట్టిక సక్రమంగా వినియోగించాలని తెలియజేశారు అదేవిధంగా ఆదర్శ పాఠశాల హాస్టల్ లో గల వసతి గృహంతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని తెలియజేశారు అదే విధంగా కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలన చేసి రికార్డులను పరిశీలించారు రోజువారీగా రికార్డులను తప్పనిసరిగా నమోదు చేయాలని పేర్కొన్నారు విద్యార్థులకు రానున్న వేసవికాలం దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు.

తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ ఎం ఏ అబ్దుల్ రహీం పంచాయతీ కార్యదర్శులు రాజా బాపు భోజన్న కస్తూర్బా ప్రిన్సిపాల్ సువర్ణ ఆదర్శ పాఠశాల హాస్టల్ నిర్వాహకురాలు సాయిప్రద తదితరులు పాల్గొన్నారు

Leave a Reply