102 cases | అండగా ఉన్నాం.. ధైర్యంగా ఉండండి

102 cases | అండగా ఉన్నాం.. ధైర్యంగా ఉండండి

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
డయేరియ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి.

102 cases | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో :శ్రీకాకుళం నగరాన్ని డయేరియా వ్యాధి ఇబ్బంది పెడితే.. జిల్లా యంత్రాంగం దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని.. తిరిగి నాలుగు రోజుల్లోనే సాధారణ స్థితికి తీసుకువచ్చారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. గురువారం నాడు శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రభావిత ప్రాంతాలు మంగువారితోట దగ్గరలోని కండ్ర వీధి, ధమ్మల వీధి ప్రాంతాలలో వ్యాధి బారిన పడ్డ వారిని, ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయినవారిని, అదేవిధంగా వ్యాధి కారణంగా మృత్యువాత పడ్డ కండ్ర వీధికి చెందిన పడ్డ సురేష్ కుటుంబాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ లతో కలిసి పరామర్శించారు.

అనంతరం కిమ్స్, జేమ్స్, రిమ్స్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి.. వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి ఆరా తీశారు. అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తామని ధైర్యంగా ఉండాలని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. శ్రీకాకుళం నగరంలో నాలుగు రోజుల క్రితం డయేరియ కేసులు నమోదు ప్రారంభం అయితే రాష్ట్ర ప్రభుత్వం సత్వరం స్పందించి.. క్షేత్ర స్థాయిలో నిరంతర పరిశీలన, సమీక్షలు చేస్తూ.. నిన్నటికే సాధారణ స్థితికి తీసుకొచ్చారని అన్నారు. అధికార యంత్రాంగం సత్వరం స్పందించారని తెలిపారు.

102 cases |

డయేరియా కారణంగా మృతి చెందిన సురేష్ కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు.. ప్రస్తుతానికి జెమ్స్, కిమ్స్, రిమ్స్, జి.జి.హెచ్ ఆసుపత్రులలో నిన్నటికి 124 కేసులు ఉండగా.. అందులో ఇరవై రెండు డిశ్చార్జి కావడంతో 102 కేసులు ఉన్నాయని అన్నారు. ఇందులో కొన్ని మాత్రమే ఇబ్బంది ఉండగా.. మిగిలిన వారి పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. తొలి కేసు నమోదు అయిన నాటి నుండే కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సత్వరం స్పందించారని.. క్షేత్ర స్థాయిలో పర్యటనలు జరిపి.. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని అన్నారు.

102 cases |

డయేరియా ఆసుపత్రులలో ఉన్నవారికి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. మంచినీటి సమస్యపై ఇప్పటికే శాంపిల్ లను కూడా తీసుకుని పరిక్షల కోసం పంపించామని.. ఫుడ్ ద్వారా ఇబ్బంది జరిగిందా అన్న కోణంలో కూడా విశ్లేషణ జరుపుతున్నారని అన్నారు. అన్ని దిశల్లో దర్యాప్తు చేసి.. వ్యాధి ఉధృతికి గల ఆసలు కారణాన్ని తెలియచేస్తామని అన్నారు. మరో వైపు నగరంలో మంచినీటి సరఫరాపై కూడా మంత్రి నారాయణ క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి పూర్తి పరిశీలన చేశారని అన్నారు. ఆయన పలు సూచనలు చెయ్యగా.. ఆ దిశగా అభివృద్ధి పనులు కూడా కార్యరూపం దాల్చాయని అన్నారు.

గతంలో కార్పోరేషన్ ను సిండికేట్ గా మార్చి దగా చేసారని.. వాటికి స్వస్తి పలుకుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్వచ్చాంద్ర పిలుపుతో శానిటేషన్, ఇతర శుభ్రత కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని.. ఎవ్వరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. మంత్రి నారాయణ తెలిపిన మేరకు సుమారు 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల ద్వారా కార్పోరేషన్ అభివృద్ధి దిశగా సమూల మార్పులు చేస్తూ అభివృద్ధికి పధకరచన చేశామని అన్నారు.

సుడా ద్వారా మరో 12కోట్ల రూపాయల తో డ్రయిన్లను ఆధునీకరిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీ రాజ్ కుమార్, డిఎంహెచ్ఓ కె. అనిత, జిజిహెచ్ సూపరిండెంట్ ఎల్ ప్రసన్న కుమార్, రిమ్స్ ప్రిన్సిపల్ ఎస్. అప్పలనాయుడు, ఆర్ ఎంఓ సుభాషిని, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply