జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదం..

ఆంధ్రప్రభ , హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ మెట్రోస్టేషన్ సమీపంలోని మంగళగౌరి షాపింగ్‌మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వస్త్ర దుకాణంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
