100 kg rice | కిడ్నీ వ్యాధిగ్రస్తుల కుటుంబాలను ఆదుకోవాలి….

100 kg rice |కిడ్నీ వ్యాధిగ్రస్తుల కుటుంబాలను ఆదుకోవాలి….

కిడ్నీ వ్యాధితో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
కిడ్నీ వ్యాధి బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

100 kg rice | రాజవొమ్మంగి (పోలవరం జిల్లా), ఆంధ్రప్రభ : పోలవరం ఏజెన్సీ ప్రాంతంలోని రాజవొమ్మంగి మండలం ఉర్లాకులపాడు గ్రామంలో కిడ్నీ వ్యాధితో పలువురు మృత్యువాత పడుతున్నారన్న ఆంధ్రప్రభ లో వార్తలకు స్పందించిన రంపచోడవరం నియోజవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి బుధవారం బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న కుటుంబాలకు రూ.25 వేల నగదు సహాయం మరియు 100 కేజీల బియ్యం అందజేశారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఉర్లాకులపాడు గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ కాకినాడ జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న కోసూరి తమ్మారావు కుటుంబాన్ని, అలాగే కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఇంటి దగ్గరే ఉన్న జె. వీరబాబు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన కోసూరి వీర గంగాభవాని తల్లి బుల్లెమ్మ, భర్త కామరాజు మూడు రోజుల వ్యవధిలో కిడ్నీ వ్యాధితో మృతి చెందడంతో ముగ్గురు చిన్నారులతో భవాని తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆ కుటుంబానికి ఎమ్మెల్యే ధనలక్ష్మి రూ.10 వేల నగదు, 50 కేజీల బియ్యం అందించారు.

అలాగే చెరుకుంపాలెం గ్రామంలో కిడ్నీ వ్యాధితో మృతి చెందిన గంగాదేవి కుటుంబానికి రూ.5 వేల నగదు, 25 కేజీల బియ్యం, కతనపల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి రూ.5 వేల నగదు, 25 కేజీల బియ్యం అందజేశారు. తంటి కొండ పంచాయితీ వట్టిగడ్డ గ్రామానికి చెందిన రుత్తల కుశరాజు భార్య మృతి చెందగా తాను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకుని ఎమ్మెల్యే ఆ కుటుంబానికి కూడా రూ.5 వేల సహాయం అందించారు.

100 kg rice |

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత కొంతకాలంగా ఏజెన్సీ ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో మరణాలు పెరుగుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. వైద్యులు గిరిజన ప్రాంతాల్లో అందుబాటులో ఉండి, బాధితులకు తక్షణ వైద్యం అందించాలన్నారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశామని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మరణాలపై అధికార పార్టీ నాయకులు స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు.

100 kg rice |

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆదిరాజు,జడ్డంగి సర్పంచ్ కొంగర మురళి, అమీనాబాద్ సర్పంచ్ కించు వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ జాన్ బాబు, కో ఆప్షన్ సభ్యులు అడపా కామేష్, ఎంపిటిసి నిర్మలదేవీ, వాణిజ్య విభాగ అధ్యక్షులు ఆద్య రమేష్, అర్జున్, లక్ష్మి పార్వతి,రమేష్ , ఉర్లకా శ్రీను,నెల్లిపూడి ప్రసాద్, అనుపోజు రాజా ,అప్పారావు, ఐ.టి వింగ్ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

100 kg rice |
100 kg rice |
100 kg rice |

Leave a Reply