ఘనంగా జన్మదిన వేడుకలు

ఘనంగా జన్మదిన వేడుకలు

  • ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ
  • పేదలు, బిక్షగాళ్ళకు భోజన ప్యాకెట్లు అందజేత

అవనిగడ్డ, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. షిర్డీసాయి అన్న ప్రసాదం సంస్థ ద్వారా పేదలు, బిక్షగాళ్లకు భోజన ప్యాకెట్లు అందించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు సింహాద్రి వెంకటేశ్వరరావు, దివి కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు బెజవాడ ధన సురేష్, మాజీ సర్పంచ్ నలుకుర్తి పృధ్వీరాజ్, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి కొండవీటి రాంప్రసాద్, ముడిమి అయ్యప్ప, రామకోటిపురం ఉప సర్పంచ్ బొప్పన పవన్ కుమార్, చందు వెంకటేశ్వరరావు, కొండవీటి శ్రీహరి, బొప్పన సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

Leave a Reply