పరీక్ష కేంద్రాలకు అలా రాకూడదు..

పరీక్ష కేంద్రాలకు అలా రాకూడదు..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేటి నుండి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జరగనున్నట్లు చీఫ్ సూపర్డెంట్ తోట సురేష్, డివో బి, రాజబాబు మంగళవారం తెలిపారు.

ఈ సందర్భంగా సిఎస్టి సురేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 8 గంటలకు చేరుకోవాలని ఎటువంటి ఎలక్ట్రానిక్ వాచ్లు, షూస్, ధరించి లోపలికి రాకూడదని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎగ్జామ్స్ సెంటర్లో ప్రథమ సంవత్సర విద్యార్థులు 386 ద్వితీయ సంవత్సర విద్యార్థులు 354 మంది జనరల్ ఒకేషనల్ పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్ష ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంద న్నారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

Leave a Reply