కొణిదెలలో విషాదం..

కొణిదెలలో విషాదం..

మట్టి మీద కూలి వృద్ధురాలు మృతి

నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గ్రంధి లక్ష్మిదేవి జమాల్ బాషా ఇంటిలో జొన్నలు ఆడించే జిన్ను వద్దకు జొన్నలు పట్టించుకోవడానికి వెల్లగా ఉన్నట్టుండి పైభాగంలోని మట్టి మిద్ద ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో గ్రంధిలక్ష్మిదేవి (75 సంవత్సరాలు ) మట్టిమిద్ద కింద ఇరుక్కొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

అదే సమయంలో జొన్నలు పట్టించుకోవడానికి అక్కడికి వచ్చిన కురువ సాలమ్మకు మట్టి మిద్ద కూలడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెకు చేయి విరిగినట్లు సమాచారం. గాయపడిన సాలమ్మను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

ఇదిలా ఉండగా, కొణిదెల గ్రామంలో వచ్చే నెల 1వ తేదీ, 2వ తేదీల్లో జాతర జరగనున్న నేపథ్యంలో ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. లక్ష్మిదేవి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply